లక్షల్లో వ్యయం.. విజ్ఞానం శూన్యం

లక్షల్లో వ్యయం.. విజ్ఞానం శూన్యం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ థీమ్ పార్క్​లో పిచ్చి మొక్కలు పెరిగి ఇలా అధ్వానంగా మారింది. రూ.30 లక్షల వ్యయంతో మూడేండ్ల కిందట అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రారంభించిన పార్క్ అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారింది.

సైన్స్ థీమ్ పరికరాలు తుప్పు పట్టి పోతున్నాయి. అధికారులు స్పందించి పార్కును స్టూడెంట్లకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

 వెలుగు ఫోటోగ్రాఫర్‍, ఆదిలాబాద్‍