
హైదరాబాద్, వెలుగు: ఇండియా స్పీడ్ స్కేటింగ్ టీమ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదీర్ ఎంపియ్యాడు. డెహ్రాడూన్‌లోని హిమాద్రి ఐస్ స్కేటింగ్ ట్రాక్‌లో ఈ నెల 23 నుంచి 23 వరకు జరగనున్న ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు తను శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ టోర్నీలో ఇండియా 500 మీ, 1000 మీ, 1500 మీ వ్యక్తిగత రేసులతో పాటు టీమ్ రిలేలలో పోటీ పడనుంది. అబ్దుల్ ఖాదీర్‌కు తెలంగాణ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.