Gautam Gambhir: నీకు అన్యాయం చేసే వ్యక్తిని కాను.. అభిమన్యు ఈశ్వరన్‌కు గంభీర్ ఓదార్పు మాటలు

Gautam Gambhir: నీకు అన్యాయం చేసే వ్యక్తిని కాను.. అభిమన్యు ఈశ్వరన్‌కు గంభీర్ ఓదార్పు మాటలు

డొమెస్టిక్ క్రికెట్‎లో పరుగుల వరద పారిస్తున్నా టాలెంటెడ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‎కు మరోసారి నిరాశ ఎదురైంది. టీమిండియా తరుఫున టెస్ట్ క్రికెట్‎లో అరంగ్రేటం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఈ బెంగాల్ బ్యాటర్‎కు మరోసారి నిరీక్షణ తప్పేలా లేదు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అభిమన్యు ఈశ్వరన్‎కు ఒక్క మ్యాచ్ లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అభిమన్యు అరంగేట్రం కోసం మరింత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత అభిమన్యు ఈశ్వరన్ కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్పు మాటలు చెప్పి ఎంకరేజ్ చేసినట్టు సమాచారం. 

అభిమన్యు ఈశ్వరన్, గంభీర్ మధ్య జరిగిన మాటలను అభిమన్యు ఈశ్వరన్ తండ్రి వెల్లడించాడు. విక్కీ లాల్వాని యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ కు గంభీర్ ఇచ్చిన హామీని గురించి తెలిపాడు. "నువ్వు చక్కగా ఆడుతున్నావు. నీకు నీ టైమ్ వస్తుంది. నీ వంతు వచ్చినప్పుడు నీకు దీర్ఘకాల కెరీర్ ఉంటుంది. ఒకటి రెండు మ్యాచ్ ల తర్వాత నిన్ను బయటకు నెట్టే వ్యక్తిని నేను కాదు”. అని ఈ ఈశ్వరన్ తో గంభీర్ అన్నట్టు ఈశ్వరన్ తండ్రి చెప్పి సంతోషపడ్డాడు. గంభీర్ మాటలను చూస్తుంటే ఈశ్వరన్ కు టీమిండియా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వస్తే ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.    

భారత టెస్ట్ జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి 2021 స్థానం సంపాదించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ నాలుగేళ్లలో ఈశ్వరన్ కు టెస్ట్ అరంగేట్రం చేయలేకపోవడం విచారకరం. ఈశ్వరన్ తర్వాత భారత స్క్వాడ్ లోకి ఎంపికైన 15 మంది ఆటగాళ్ళు ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ లో తమ తొలి మ్యాచ్ ఆడేశారు.

►ALSO READ | ZIM vs NZ: పసికూనపై ప్రతాపం: ముగ్గురు సెంచరీల మోత.. కివీస్‌కు ఆధిక్యం 437 పరుగులు

కెయస్ భరత్, సూర్య కుమార్ యాదవ్,జైశ్వాల్, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్,ప్రసిద్ కృష్ణ , పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్,ఆకాష్ దీప్, పడికల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, సాయి సుదర్శన్, కంబోజ్ టెస్ట్ టీమిండియా తరపున టెస్ట్ అరంగేట్రం చేశారు. 29 ఏళ్ల ఈశ్వరన్ 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ అతడికకి ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా టీమిండియాకు ఎంపిక అయ్యాడు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. ఇటీవలే ఇంగ్లాండ్ సిరీస్ లోనూ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.