V6 News

Abhishek Sharma: దాయాది దేశంలో టీమిండియా ఓపెనర్ హవా.. పాకిస్థాన్‌లో "గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" అభిషేక్ శర్మ

Abhishek Sharma: దాయాది దేశంలో టీమిండియా ఓపెనర్ హవా.. పాకిస్థాన్‌లో "గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" అభిషేక్ శర్మ

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్ గూగుల్ సెర్చ్ లో సత్తా చాటాడు. 2025 ఏడాది పాకిస్థాన్ లో " గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో ఉండడం విశేషం. పాకిస్థాన్ గూగుల్ లో ఎక్కువగా ఈ యువ క్రికెట్ ను వెతకడం ఆసక్తికరంగా మారింది. ఇండియాలో కంటే పాకిస్థాన్ లో ఈ పంజాబీ ప్లేయర్ ను గూగుల్ లో ఎక్కువగా వెతకడం విశేషం. పాకిస్తాన్ క్రికెటర్లు హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ అబ్బాస్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 

2025లో జరిగిన ఆసియా కప్ లో అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు దడ పుట్టించాడు. టోర్నీలో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. పాకిస్థాన్ తో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో 13 బంతుల్లో 31 పరుగులు చేశాడు. సూపర్-4 లో  39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మాత్రం సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో అభిషేక్ శర్మ నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.  

పాకిస్థాన్ లో " గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" లిస్ట్ 2025:

1. అభిషేక్ శర్మ (భారతదేశం)
2. హసన్ నవాజ్
3. ఇర్ఫాన్ ఖాన్ నియాజీ
4. సాహిబ్జాదా ఫర్హాన్
5. ముహమ్మద్ అబ్బాస్  

ఐపీఎల్ లో పంజాబ్ టాప్:
 
గూగుల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్ టీమ్స్‌‌‌‌ సీఎస్కే, ముంబై ఇండియన్స్‌‌‌‌, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీని వెనక్కి నెట్టి పంజాబ్ కింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన ఐపీఎల్‌‌‌‌ జట్టుగా నిలిచింది. కేవలం ఐపీఎల్‌‌‌‌ జట్లలోనే కాదు, ఫుట్‌‌‌‌బాల్ దిగ్గజాలైన పారిస్ సెయింట్-జర్మైన్, బెన్ఫికా, టొరంటో బ్లూ జేస్ వంటి వరల్డ్ టాప్ స్పోర్ట్స్‌‌‌‌ టీమ్స్ సరసన నిలిచి ఔరా అనిపించింది. గత ఎడిషన్‌‌‌‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌గా నిలిచినప్పటికీ సెర్చ్ ఇంజన్లలో మాత్రం పంజాబ్ కింగ్స్  గ్లోబల్ చాంపియన్‌‌‌‌గా నిరూపించుకుంది.

ALSO READ : కోహ్లీని మిస్ అవుతున్న ఫ్యాన్స్.. టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్-3లో రూట్, విలియంసన్, స్మిత్

2025 "మోస్ట్ గూగుల్ సెర్చ్ ఇన్ ఇండియా" ప్లేయర్ లిస్ట్ తీస్తే వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ తర్వాత ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఉన్నాడు. టీమిండియా ఓపెనర్, నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. షేక్ రషీద్ నాలుగో స్థానంలో.. భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఐదవ స్థానంలో ఉన్నారు. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు టాప్-5 లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయుష్ మాత్రే, స్మృతి మంధాన, కరుణ్ నాయర్, ఉర్విల్ పటేల్, విఘ్నేష్ పుత్తూరు వరుసగా 6,7,8,9,10 స్థానాల్లో నిలిచారు.