DC vs SRH: 11 సిక్సులు, 13 ఫోర్లు.. పవర్ ప్లే లో సన్ రైజర్స్ ఆల్‌టైం రికార్డ్

DC vs SRH: 11 సిక్సులు, 13 ఫోర్లు.. పవర్ ప్లే లో సన్ రైజర్స్ ఆల్‌టైం రికార్డ్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ జూలు విదిల్చింది. పవర్ ప్లే లో వీర ఉతుకుడుతో శివాలెత్తారు. కొడితే ఫోర్, లేకపోతే సిక్సర్ అన్నట్టుగా ఆడుతూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 
పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్,అభిషేక్ శర్మ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరి ధాటికి సన్ రైజర్స్ 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.

గతంలో ఈ రికార్డ్ కేకేఆర్ తరపున ఉంది. 2017 లో ఆర్సీబీపై 105 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ తొలి ఓవర్ నుంచే విధ్వంసం సృష్టించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి ధాటికి తొలి ఓవర్లో 19 పరుగులు.. రెండో ఓవర్లో 21.. మూడో ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. తొలి మూడు ఓవర్లలోనే ఏకంగా 62 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు ఓవర్లలో మరో 63 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో హెడ్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో  11 ఫోర్లు, 6 సిక్సులతో 84 పరుగులు చేస్తే.. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.