తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ

న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అభిషేక్ మను సింఘ్వీ నామినేట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జూలైలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ కే. కేశవరావు రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఈ స్థానానికి సెప్టెంబర్3, 2024న పోలింగ్ జరగనుంది. 

బుధవారంఆగస్టు 14, 2024న తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీని నామినేట్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. తెలంగాణలో 68 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు 40 స్థానాలండగా, బీజేపీకి కేవలం 25 మాత్రమే ఉన్నాయి. మిగిలిన ముగ్గురు శాసనసభ్యులు స్వతంత్రులు వీరంతా బీజేపీ పక్షాన నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ బలం ఉండటంతో సింఘ్వీ ఎన్నిక లాంఛనమే అయింది.