అభ్యాస్ లెక్స్ క్వెస్ట్ ఆరంభం

అభ్యాస్ లెక్స్ క్వెస్ట్ ఆరంభం

హైదరాబాద్, వెలుగు:  అభ్యాస్ ఎడ్యు టెక్నాలజీస్ లెక్స్ క్వెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్​ కాకుండా ఇతర కెరీర్​లను ఎంచుకోవడానికి వీలవుతుంది. ఈ 60 నిమిషాల సామర్థ్య పరీక్ష మొదటి దశ సెప్టెంబర్, నవంబర్ మధ్య స్కూళ్లలో జరుగుతుంది. నవంబర్ 26న న్యాయ దినోత్సవం సందర్భంగా తుది పోటీ ఉంటుంది. 

అభ్యాస్​ఫౌండర్​ నరేష్ రెడ్డి మాట్లాడుతూ, సామర్థ్యం, అభిరుచి ఆధారంగా సరైన వృత్తిని ఎంచుకోవడానికి విద్యార్థులకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అన్నారు.  ఈ టెస్టు విద్యార్థిలో మాట్లాడే సామర్థ్యం (వర్బల్ ఎబిలిటీ), తార్కిక సామర్థ్యం (లాజికల్ రీజనింగ్), పరిమాణాత్మక నైపుణ్యాలు (క్వాంటిటేటివ్ స్కిల్స్) ఎలా ఉన్నాయో తెలియజేస్తుందని అన్నారు.