
హైదరాబాద్, వెలుగు : నీటిపారుదల శాఖలో కొనసాగుతున్న రిటైర్డ్ ఇంజనీర్ల కొనసాగింపును రద్దు చేయాలని డిపార్ట్మెంటల్ ఇంజనీర్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రికి వినతిపత్రం అందజేశారు. డిపార్ట్మెంట్లో ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ క్యాడర్లో పలువురు రిటైర్డ్ఇంజనీర్లు పని చేస్తున్నారని, వారి ఎక్స్టెన్షన్ల కారణంగా జూనియర్ క్యాడర్ ఇంజనీర్లకు ప్రమోషన్లు దక్కడం లేదని తెలిపారు. తద్వారా వారి శక్తి సామర్థ్యాలు డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న వారిని తొలగించి వారి స్థానంలో డిపార్ట్మెంట్లో ఆ తర్వాతి క్యాడర్లో పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జోన్–6 ఇంజనీర్లకు న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. సోమవారం జలసౌధలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ రెడ్డి, చక్రధర్మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. డిపార్ట్మెంటల్ప్రమోషన్లలో జోన్–6 ఇంజనీర్లకు అన్యాయం జరిగిందని తెలిపారు. డిపార్ట్మెంట్లో ఆరుగురు ఈఎన్సీలు ఉంటే అందరూ ఐదో జోన్వారే ఉన్నారని, 30 సీఈ పోస్టులు ఉంటే ఆరుగురు మాత్రమే ఆరో జోన్‌వారు ఉన్నారని, 57 ఎస్ఈ పోస్టుల్లో 33 మంది ఐదో జోన్‌వారు, 24 మంది ఆరో జోన్‌వారు ఉన్నారని తెలిపారు.