అంచనాలు లేకుండా ఎంట్రీ.. అదరగొట్టి టైటిల్ గెలిచింది : ఎవరీ దివ్య దేశ్ముఖ్.. ప్రపంచం చెస్ రంగంలో విప్లవం

అంచనాలు లేకుండా ఎంట్రీ.. అదరగొట్టి టైటిల్ గెలిచింది : ఎవరీ దివ్య దేశ్ముఖ్.. ప్రపంచం చెస్ రంగంలో విప్లవం

చెస్ అంటే ఇండియా.. ఇండియా అంటే చెస్ అని ప్రపంచానికి చాటిచెప్పిన సమయం ఇది. గ్రాండ్ మాస్టర్లైనా.. వరల్డ్ ఛాంపియన్లైనా చదరంగంలో అది ఇండియాకే సాధ్యం అని నిరూపించిన సందర్భం. చెస్ లో ఇండియాను కొట్టలేరని.. ఒకవేళ ఇండియన్స్ ను గెలవాలంటే అది మరో ఇండియన్ కే సాధ్యమని చాటి చెప్పిన తరుణం. ఇండియా నెంబర్ వన్, వరల్డ్ ఛాంపియన్ అయిన కోనేరు హంపీ పైనే ఒక 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ గెలిచి చరిత్ర తిరగరాసిన సందర్భంగా స్పెషల్ స్టోరీ.

ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో..  ఒకవైపు చెస్ లో కాకలు తీరిన యోధురాలు.. ఇండియన్ నెంబర్ వన్, వరల్డ్ ఛాంపియన్ అయిన కోనేరు హంపీ. మరోవైపు 15వ సీడ్ గా టౌర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అంచనాలు లేకుండా అంచెలంచెలుగా గెలిచి ఫైనల్ చేరిన దివ్య దేశ్ముఖ్. ఇద్దరి మధ్య పోటీ అంటే హంపీదే పై చేయి అన్నుకున్నారు అందరు. ప్రపంచంలోనే ఎంతో మందిని ఓడించి చెస్ లో దండయాత్రను కొనసాగిస్తున్న కోనేరు హంపీతో పోటీ అంటే మ్యాచ్ ఏకపక్షమే అనుకున్నారు చదరంగం అభిమానులు. కానీ.. 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్.. వరల్డ్ ఛాంపియన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా చరిత్ర తిరగరాసింది. ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో చరిత్రలో వరల్డ్ ఛాంపియన్ గా తన పేరు రాసుకుంది విన్నర్ దివ్య దేశ్ముఖ్. 

ఫిడే విమెన్స్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ చరిత్ర తిరగరాసింది. ఫైనల్ లో ఇండియా నెంబర్ వన్, వరల్డ్ ఛాంపియన్ కోనేరు హంపీపై గెలిచి ఇండియా 88వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డు సృష్టించింది. జార్జియా లోని బతుమీలో జరిగిన ఫైనల్ లో 15వ సీడ్ గా టౌర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య దేశ్ ముఖ్.. స్టార్ ప్లేయర్ హంపీతో ప్రెజర్ తట్టుకుని విజేతగా నిలిచింది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్లను వెనక్కి నెడుతూ ఫైనల్ చేరిన దివ్య గెలుపు.. ఇప్పుడు ప్రపంచ చదరంగంలో కొత్ అధ్యాయంగా నిలిచింది.

మ్యాచ్ సాగిందిలా: 

ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులలో ఎంతో ఉత్కంఠకు తెరలేపింది. ఇద్దరి మధ్య రెండు డ్రాల తర్వాత.. ర్యాపిడ్ టై బ్రేక్స్ మొదలయ్యాయి. ఫస్ట్ ర్యాపిడ్ గేమ్ లో  వైట్ పీసెస్ తో ఆడిన దివ్య మ్యాచ్ ను డ్రా గా ముగించింది. రెండో గేమ్ లో బ్లాక్ పీస్ ఆడుతూ రిమార్కబుల్ విన్నింగ్ నమోదు చేసింది. 

ఎండ్ గేమ్ లో 19 ఏళ్ల దివ్య వేసే ఎత్తులకు 38 ఏళ్ల హంపీ, అందులో వరల్డ్ ఛాంపియన్..  ప్రెజర్ కు గురైంది. ఆ టెన్షన్ లో హంపీ చేసిన మిస్టేక్స్ ను ప్లస్ పాయింట్స్ గా మలచుకున్న దివ్య.. గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.  ఈ గెలుపుతో ఫిడే విమెన్స్ వరల్డ్ చాంపియన్ గానే కాకుండా.. తన కెరీర్ లో ఫైనల్ గ్రాండ్ మాస్టర్ ను సాధించింది. 

►ALSO READ | FIDE Women’s World Cup: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్..19 ఏళ్లకే FIDE మహిళల ప్రపంచ కప్ సొంతం

ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్ సాధించిన 4వ ఇండియన్ విమెన్ గా దివ్య దేశ్ ముఖ్ నిలిచింది. అదే విధంగా 88వ ఇండియన్ గా మైల్ స్టోన్ కు చేరుకుంది. దివ్య గెలుపుతో ఇండియాలో మరో కొత్త జనరేషన్ రైజింగ్ అవుతున్నట్లుగా భావిస్తున్నారు ప్రేక్షకులు. చెస్ ప్రపంచాన్ని డామినేట్ చేసేందుకు దివ్య ఎంట్రీ ఇచ్చిందని సంబరాలు  చేసుకుంటున్నారు.  కేవలం  19 ఏళ్లలోనే వరల్డ్ చెస్ చాంపియన్ గా నిలవటం తన అదృష్టంగా చెప్పుకుంది దివ్య. 

దివ్య దేశ్ముఖ్ చెస్ జర్నీ:

దివ్య దేశ్ ముఖ్ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో 2005, డిసెంబర్ 9న జన్మించింది. తల్లిదండ్రులు జితేంద్ర దేశ్ ముఖ్, నమ్రతా దేశ్ ముఖ్.. ఇద్దరూ డాక్టర్లే. చిన్ననాటి నుంచి చెస్ ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకుంటూ సూపర్బ్ ట్యాలెంట్ తో ఎదిగింది. 

దివ్య దేశ్ ముఖ్ విజయాల పరంపరం2023 లో ఏసియన్ కాంటినెంటల్ విమెన్స్ టైటిల్ గెలుపుతో మొదలైంది. ఆ టోర్నమెంట్ లో చివరి నిమిషంలో.. రీప్లేస్ మెంట్ లో వచ్చిన దివ్య.. లోయెస్ట్ సీడ్ లో వచ్చి.. ఏషియన్ కాంటినెంటల్ గెలిచి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఆ తర్వాత టాటా స్టీల్ విమెన్స్ రాపిడ్ సెక్షన్ లో టాప్ పొజిషన్ సాధించింది. వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ ను ఓడించి టాటా స్టీల్ రాపిడ్ సెక్షన్ లో టాప్ ప్లేస్ కు వెళ్లింది. వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ ఛాంపియన్ షిప్ లో  10/11 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ సాధించింది. అంతేకాకుండా దివ్య.. ఒలింపియాడ్ లో త్రీ టైమ్ గోల్డ్ మెడలిస్ట్ కూడాను. దివ్య దేశ్ 2021 లో విమెన్ గ్రాండ్ మాస్టర్, 2023 లో ఇంటర్నేషనల్ మాస్టర్, 2025 లో గ్రాండ్ మాస్టర్ గా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.