V6 News

ఎలక్షన్‌‌‌‌ డ్యూటీకి గైర్హాజర్‌‌‌‌.. 17 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్‌‌‌

ఎలక్షన్‌‌‌‌ డ్యూటీకి గైర్హాజర్‌‌‌‌.. 17 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్‌‌‌

వికారాబాద్, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన 17 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ వికారాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ప్రతీక్‌‌‌‌ జైన్‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌ జారీచేశారు. వికారాబాద్‌‌‌‌ జిల్లా బషీరాబాద్‌‌‌‌ మండల డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. కుల్కచర్ల మండలంలోని పటేల్‌‌‌‌చెరువు తండా ఎస్‌‌‌‌జీటీ మానస, నీటూరు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నసీం రెహానా, పెద్దేముల్ మండల ఎంపీపీఎస్‌‌‌‌కు చెందిన స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌అన్నపూర్ణను పోలింగ్‌‌‌‌ ఆఫీసర్లుగా నియమించారు. 

కాగా, వీరు డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విధులకు గైర్హాజరు అయ్యారు. అలాగే దౌల్తాబాద్‌‌‌‌ మండలానికి చెందిన వంగరి అఖిల్, తన్వీర్‌‌‌‌ ఫాతిమా, రాజశేఖర్, నాటికరూ నీలప్ప, తలారి పద్మమ్మ, కె.మౌనిక, విజయలక్ష్మి, కాల్‌‌‌‌కొండి గోపి సాయి, పానుగంటి శారద, ఎండీ.ఆయుబ్‌‌‌‌ పాషా, సిందె శ్రీనివాస రమేశ్‌‌‌‌, ఎక్కేల్లి భీమయ్య, సబీహ సుల్తానా, ఇస్రా జాబిన్‌‌‌‌ సైతం డ్యూటీకి రాలేదు. దీంతో మొత్తం 17 మందిని సస్పెండ్‌‌‌‌ చేస్తూ కలెక్టర్‌‌‌‌ ప్రతీక్‌‌‌‌ జైన్‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.