ఓయూ నుంచి మహా ధర్నాకు ర్యాలీగా బయల్దేరిన ఏబీవీపీ నేతలు

ఓయూ నుంచి మహా ధర్నాకు ర్యాలీగా బయల్దేరిన ఏబీవీపీ నేతలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి24 నుంచి మొదలైన నిరసనలు ఇంకా ఆగలేదు. ఈ నేపథ్యంలో మార్చి 25న  ఓయూకు పెద్ద ఎత్తున చేరుకున్న ఏబీవీపీ నేతలు.. బీజేపీ చేపట్టిన మహా ధర్నాకు బయలు బయలుదేరారు. అందులో భాగంగా ఇందిరా పార్క్ వరకు చేపట్టిన మహా ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నడక మొదలుపెట్టారు. "ఓ చంద్రశేఖరుడా ఏమిటీ ఈ పరిస్థితి.. ఎందుకు మాకు ఈ దుస్థితి.." అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయ చేయాలని, పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నామమాత్రంగా ఇద్దరి పేర్లు చెప్పి, తూతూమంత్రంగా కేసు ముగించాలని చూస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపించారు.

సిట్ మీద తమకు లేదన్న ఏబీవీపీ కార్యకర్తలు.. పేపర్ లీక్ ఘటనలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ఏ1, ఏ2, ఏ3ల కింద చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. పీఎస్ కు తరలించారు. మరికొంత మంది పోలీసుల నుంచి తప్పించుకుని ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. 

https://youtu.be/rr3FJFYON90