విశాఖ స్టేడియం స్టాండ్స్‌‌‌‌కు మిథాలీ, కల్పన పేర్లు

విశాఖ స్టేడియం స్టాండ్స్‌‌‌‌కు మిథాలీ, కల్పన పేర్లు

విశాఖపట్నం: ఇండియా విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్‌‌‌‌లకు టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌, రవి కల్పన పేర్లను పెట్టనున్నారు. స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ స్మృతి మంధాన చేసిన విజ్ఞప్తి మేరకు ఆంధ్ర క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఈ నిర్ణయం తీసుకుంది. విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా ఈ నెల 12న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌‌‌‌ సందర్భంగా నేమింగ్‌‌‌‌ సెర్మనీ జరగనుంది. ఆగస్టులో జరిగిన ‘బ్రేకింగ్‌‌‌‌ బౌండరీస్‌‌‌‌ ఫైర్‌‌‌‌సైడ్‌‌‌‌ చాట్‌‌‌‌’ అనే షోలో  స్మృతి ఈ విజ్ఞప్తి చేసింది.

వైజాగ్‌‌‌‌ స్టేడియంలోని స్టాండ్స్‌‌‌‌కు ప్రముఖ విమెన్స్‌‌‌‌ క్రికెటర్ల పేర్లు పెట్టాలని ఆమె ఏపీ మినిస్టర్‌‌‌‌ నారా లోకేశ్‌‌‌‌ను కోరింది. దాంతో ఏసీఏతో చర్చలు జరిపిన లోకేశ్‌‌‌‌ స్టాండ్స్‌‌‌‌కు పేర్లు పెట్టేందుకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చాడు. ఇండియా విమెన్స్‌‌‌‌ క్రికెటర్లతో అత్యంత టాలెంటెడ్‌ బ్యాటర్‌‌గా కూడా పేరు తెచ్చుకుంది. తన ఆటతో . దేశంలో మహిళా క్రికెట్‌‌‌‌ రూపు రేఖలు మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆంధ్ర వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌గా సేవలందించిన రవి కల్పన.. రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌ వరకు ఎదిగింది.