
హైదరాబాద్: లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడో అధికారి. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చెయ్యడం కోసం జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ను కలిశాడు. కాగా, రవికుమార్ ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చెయ్యాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచమివ్వలేని ఈశ్వరయ్య ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రవికుమార్ అడిగిన 5 లక్షలలో ఒక లక్ష రూపాయలు ఈ రోజు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పక్కాప్లాన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.