ఏసీబీ వలలో మహబూబ్​నగర్ మున్సిపల్ ఏఈ

ఏసీబీ వలలో మహబూబ్​నగర్ మున్సిపల్ ఏఈ

పాలమూరు, వెలుగు: మహబూబ్​నగర్ లోని మున్సిపల్ ఆఫీసు ఏఈ పృథ్వీ మున్సిపల్ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ కథనం ప్రకారం...మహబూబ్​గర్ కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్  పిట్ల యాదయ్య 2014 నుంచి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. రోడ్డు పనులు, శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరెంట్​లైట్ల కాంట్రాక్టును రూ.11 లక్షలకు తీసుకొని పనులు చేశాడు. బిల్లులు పాస్  చేయాలని మున్సిపల్ ఏఈ పృథ్వీని అడగ్గా రూ.70 వేల లంచం డిమాండ్​ చేశాడు.

అయితే, రూ.50 వేలు ఇస్తానని నమ్మించిన యాదయ్య ఈ నెల 7న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ చౌరస్తాలో పృథ్వీకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ రైడ్​ చేసి పట్టుకుంది. ఏఈని కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ ట్రోల్  ఫ్రీ నెంబర్ 10 64కు లేదంటే మహబూబ్​నగర్  ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేయవచ్చన్నారు.