లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇద్దరు అధికారులు

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇద్దరు అధికారులు

రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వ‌హించారు. శంషాబాద్ మండలంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. నర్కూడ గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజు రూ. 45వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. 

నార్కుడా గ్రామ పంచాయతీ మధు అని వ్యక్తి అమ్మపల్లి గ్రామం దగ్గర ఇల్లు నిర్మించుకునేందుకు పర్మిషన్ కోసం.. బాధితుడు మధు సెక్రెటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజును.. జనవరి 2వ తేదీనా కలిసి పర్మిషన్ కోసం సంప్రదించాడు. అయితే వారు పర్మిషన్ కోసం రూ. 65000 చెల్లించాలని మధుకు తెలిపారు. అంతడబ్బు తాను చెల్లించలేనని ఏమైనా తగ్గించాలని అడగగా.. చివరికి రూ. 45 వేలకు బేరం కుదిరింది. 

అయితే ఈరోజు జనవరి 23న డబ్బు చెల్లించేందుకు గ్రామపంచాయతీ వద్దకు రావాలని బాధితుడు మధుకు బిల్ కలెక్టర్ నాగరాజు చెప్పాడు. దీంతో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామ పంచాయతీకి చేరిన మధు.. అప్పటికే ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో మధు ఏసీబీ అధికారులు వేసిన పథకం ప్రకారం బాధితుడు రూ. 45 వేలు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ పై కేసు నమోదు చేసి.. ఇద్దరిని అరెస్టు చేశారు.

వీరిని రేపు(జనవరి 24) నాంపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. కాగా పంచాయతీ సెక్రెటరీ నివాసంలో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.