జడ్చర్ల, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్‌ను శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు తనిఖీ చేశారు. మున్సిపల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పాటు తనను రూ.50 వేలు లంచం అడుగుతున్నారని ఓ కాంట్రాక్టర్ ఇటీవల ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన ఏసీబీ 13 మంది ఆఫీసర్లతో బృందంతో తనిఖీలు చేపట్టింది.
శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన రికార్డుల పరిశీలన సాయంత్రం వరకు కొనసాగింది. ఇటీవల పదవీ కాలం ముగిసిన పాలకవర్గంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించింది. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన అనుమతులతో పాటు లేఔట్ పర్మిషన్ల రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సీహెచ్.బాలకృష్ణ వెల్లడించారు.
