
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ముగ్గురు కీలక నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. శనివారం ( సెప్టెంబర్ 6 ) ఈ కేసు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కొన్ని గంటల్లోనే ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో మే 13న అరెస్టయిన బాలాజీ గోవిందప్పను, మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఇప్పటివరకు నలుగురికి బెయిల్ మంజూరయ్యింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ కేసు నమోదు కావడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఇవాళ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.
►ALSO READ | తిరుమలకు పోటెత్తిన భక్తులు.... దర్శనానికి ఎంత సమయమంటే..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తిరిగి సెప్టెంబర్ 11న సరెండర్ కావాలని ఆదేశించింది కోర్టు.