
శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు టోల్‌గేట్, దర్శన టిక్కెట్ కౌంటర్, డొనేషన్ కౌంటర్‌లలో రికార్డుల పునఃపరిశీలన చేశారు. గతంలో దేవస్థానం అభివృద్ధి చేసిన ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. కర్నూలు, విజయవాడ ఏసీబీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వలయ రహదారి, ఆలయ మాడవీధులు, పుష్కరిణి, శివాజి గోపురం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పనుల నాణ్యత, భద్రత ప్రమాణాలను ఏసీబీ సీఐ వంశీధర్ ఆధ్వర్యంలోని ఐదుగురి సభ్యులతో పరిశీలించారు. ఏసీబీ అధికారుల వెంట దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.