-
తెలుగు రాష్ట్రాల్లో 10 చోట్ల సోదాలు
-
ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు
-
ఆయన కూతురు, స్నేహితుల ఇళ్లల్లోనూ సోదాలు
-
వైజాగ్‌లో బంధువుల నివాసంలోనూ..
-
భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లు సీజ్
-
సాహితీ ఇన్‌ఫ్రా కేసు ఐవోగా ఉమామహేశ్వరరావు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ రెయిడ్స్కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఏకకాలంలో10 చోట్ల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సీసీఎస్ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అశోక్‌నగర్‌లో ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఉమామహేశ్వరరావు ఆఫీసు క్యాబిన్‌తో పాటు ఆయన స్నేహితులు, కూతురు, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో రెయిడ్స్జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, మిగతా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ దాడులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు ఉన్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో విచారణ అధికారి (ఐవో)గా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సైబర్క్రైమ్డిటెక్టీవ్ డిపార్ట్మెంట్మూడో టీంలో ఆయన పనిచేస్తున్నారు
