నాలుగు లక్షల లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయి ఏడుస్తూ పశ్చాతాపం !

నాలుగు లక్షల లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయి ఏడుస్తూ పశ్చాతాపం !

రంగారెడ్డి జిల్లా: నాలుగు లక్షలు లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడిన నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇంట్లో బుధవారం తెల్లవారుజామున వరకు సోదాలు చేశారు. ఏసీబీ అధికారులు ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నారు. నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది హవా కొనసాగుతుంది. గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా నార్సింగి పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగాయి. లంచాలకు మరిగి అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

మణి హారిక ఏసీబీకి దొరికిపోయిన సందర్భంలో తీవ్ర నిరాశతో కనిపించింది. కంటతడి పెట్టుకుంది. తప్పు చేసి ఇలా పశ్చాతాపం చెందడం, అన్యాయంగా ఆమెను ఏదో ఇరికించినట్లు ఆమె హావభావాలు ఉండటంతో ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఏసీబీ అధికారులకు మణి హారిక చేతులెత్తి మొక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జీతం తక్కువేం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులకు అనుభవాన్ని బట్టి శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. గౌరవప్రదమైన ఉద్యోగంలో కొనసాగుతూ.. ఇలా లంచాలకు అలవాటు పడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇలాంటి వారిని తాత్కాలికంగా ఉద్యోగంలో నుంచి తొలగించడం కాకుండా జాబ్ నుంచి పర్మినెంట్గా తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

నార్సింగి మున్సిపాలిటీ టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ ఆఫీసర్‌ మణి హారిక‌‌‌ భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. మంచిరేవుల గ్రామంలో ఓ వ్యక్తి ఓపెన్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు దరఖాస్తు చేశాడు. వీటిని ప్రాసెస్‌‌‌‌ చేసి జారీ చేయడానికి టీపీవో మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్‌‌‌‌ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకుంది. మంగళవారం సిటీ రేంజ్‌‌‌‌–2 యూనిట్‌‌‌‌ ఆఫీసులో ఆమె లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. రెడ్‌‌‌‌ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు.