కోదాడ లేబర్‌‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు

కోదాడ లేబర్‌‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లేబర్ ఆఫీసులో శనివారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొంతకాలంగా చనిపోయిన వారి పేరిట నకిలీ సర్టిఫికెట్స్ తో లేబర్ ఇన్య్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారని ఈ దందాలో ఆఫీసుకు సంబంధించిన వారితో పాటు కోదాడ పట్టణంలోని  ఓ మీ సేవా యాజమాన్యం హస్తం ఉందనే ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

సోదాల సమయంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెలవులో ఉండడం, కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆదివారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.  పూర్తి సోదాల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మీడియాకు వెల్లడించారు.