గొర్రెల స్కామ్ నిందితులను విచారిస్తున్న ఏసీబీ

గొర్రెల స్కామ్ నిందితులను విచారిస్తున్న ఏసీబీ

బీఆర్ఎస్  సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కాంపై విచారణ ముమ్మరం చేసింది ఏసీబీ. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్..తలసాని మాజీ OSD కళ్యాణ్ కుమార్ లను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి  కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

 ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రామ్ చందర్ నాయక్, కళ్యాణ్ లను కస్టడీలో ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కాంలో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో పలువురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. 

గొర్రెల స్కామ్ లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించింది.  పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , OSD కళ్యాణ్ అరెస్ట్ తో  రూ. 700 కోట్ల స్కామ్ జరిగిందని తెలిపింది తేల్చింది.   700 కోట్ల స్కామ్ కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది ఏసీబీ.  ఇవాళ్టి  కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి  వచ్చే అవకాశం ఉంది.  ఇప్పటికే  కాంట్రాక్టర్ మోహినూద్దిన్ ఇప్పటికే పరారీలో ఉన్నారు.