మావల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

మావల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. మావల మండలంలో 14 ఎకరాలకు సంబంధించిన నాలుగు పట్టాపాస్ బుక్ లో వివరాల సవరణ కోసం ఆదిలాబాద్ కు చెందిన యతీంద్రనాథ్ యాదవ్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి మావల ఎమ్మార్వో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. 

అయితే.. ఇందుకోసం ఎమ్మార్వో ఆరిఫా సుల్తానా, ఆర్.ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఆఫీస్ లో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ లోని ల్యాప్ టాప్ లో వివరాలను పరిశీలించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.