హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు జనవరి 24వ తేదీ బుధవారం సోదాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇల్లు, బంధువులు కార్యాలయాల్లో సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు..  సోదాలు నిర్వహిస్తున్నారు. అమీర్ పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు
 
హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ.. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.