హైదరాబాద్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అవినీతి ఆరోపణలతో జూన్ 16 (మంగళవారం) ఉదయం మల్టీజోన్ 2 ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. వివిధ కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న నరహరి భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుంకరి నరహరి ఇల్లు సహా 11 ప్రాంతాల్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో జరిగిన ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు
