ఏపీలో ఏసీబీ ముమ్మర సోదాలు

ఏపీలో ఏసీబీ ముమ్మర సోదాలు

ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందికి ఓ చులకన భావన ఉంటుంది. మనం ఏం చేసిన అడిగే వారుండరులే అని కొందరు ఉద్యోగులు భావిస్తుంటారు. అలా కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే.. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ప్రజలను పీడించే వారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిపై నిత్యం వందల ఫిర్యాదులు వస్తుంటాయి.  తరచూ ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుంటారు . తాజాగా ఏపీ వ్యాప్తంగా రిజిష్ట్రేషన్, ఎమ్మార్వో కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.   . ఏకకాలంలో ఈ దాడులు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఫిర్యాదులొచ్చాయి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో కార్యాలయాలపై అవినితీ నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. 14400 కాల్ సెంటర్ , యాప్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలు చేపటింది. కడప జిల్లాలోని బద్వేల్ ఎమ్మార్వో ఆఫీస్, తిరుపతి, అనంతపురం గ్రామీణ, తూర్పుగోదావరి జిల్లాలో తుని, నర్సాపురం, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, మేడికొండురూ, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంతో పాటు అనేక కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు.

భయంతో ఆఫీసులకు రాని సిబ్బంది

రెవెన్యూ సెక్షన్‌లో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినప్పుడు యజమానుల పేరు మార్పులకు ఫైల్‌కు వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో పలు కార్యాలయాల ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్, తహశీల్దార్ కార్యాలయాల పై ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ దాడులు చేస్తున్న విషయం తెలిసి… భయంతో పలువురు ఉద్యోగులు ఆఫీసులకు రాలేదు. అలానే ఈ తనిఖీల్లో భాగంగా పలువురు అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రానా నటించిన ‘లీడర్’ తరహాల్లో అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపారని కొందరు అభిప్రాయా పడుతున్నారు.. మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అవినితీ నిరోధక శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు