డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటూ దొరికిపోయిన సబ్ రిజిస్ట్రార్

డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటూ దొరికిపోయిన సబ్ రిజిస్ట్రార్
  • దాడి చేసి అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
  • యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘటన

యాదాద్రి: సబ్ రిజిస్ట్రార్ నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని గంటలపాటు యాదగిరిగుట్ట  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తలుపులు వేసి సోదాలు చేశారు. ఒక వెంచర్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బును నేరుగా కాకుండా డాక్యుమెంట రైటర్ ప్రభాకర్ ను మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. 
సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ చెప్పినట్లే వెంచర్ నిర్వాహకులు రూ.20 వేలు లంచం డబ్బు తీసుకుని డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ కు ఇవ్వగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. డాక్యుమెంట్ రైటర్ తోపాటు.. సబ్ రిజిస్ట్రార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా కొన్ని గంటలపాటు కార్యాలయం తలుపులు వేసి సోదాలు నిర్వహించారు.