కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరులో గురువారం తెల్లవారుజాము వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా వారిపై ఏసీబీ రైడ్చేసింది. ఈ సందర్భంగా అధికారులు లెక్క చూపని రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని తిరువూరు క్రాస్ రోడ్‌లో మూడు రోజులుగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది జీఎస్టీ ట్కాక్స్పేరుతో వాహనాలు తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో వారు నిఘా పెట్టి ఈ దాడులు చేశారు.
ఈ క్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఏసీపీవో -శ్రీరామ్, సిబ్బంది దగ్గర రూ.10 వేలు దొరకగా సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. సెల్ ఫోన్లు, రికార్డులను స్వాధీనం చేసుకొని ఏసీపీవో, సిబ్బందిని ఖమ్మం ఏసీబీ ఆఫీసుకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్తెలిపారు.