ఈ ఐఏఎస్ అధికారిణి అక్రమాస్తులు రూ.250కోట్లకు పైనే..!

ఈ ఐఏఎస్ అధికారిణి అక్రమాస్తులు రూ.250కోట్లకు పైనే..!

ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు డాక్టర్ సుధ ఐఏఎస్. కర్ణాటక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈమె ఆస్తులు ఎంతున్నాయనుకుంటున్నారు. ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కేరళ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే స్వప్న సురేష్ సంపాదించిన ఆస్తుల కంటే ఎక్కువేనంట. ఈ విషయం అబ్రహం అనే వ్యక్తికి తెలిసింది. అబ్రహం కర్ణాటకలోని ఆర్టీఐ కార్యకర్త . అక్కడ అక్రమార్కులకు ఆయనంటే హడల్. అలాంటి అబ్రహం వద్దకు సుధ ఆస్తుల చిట్టా చేరడంతో..ఆధారాలతో సహా లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  ఈ మహిళా ఐఏఎస్ అధికారిణి అక్రమార్జన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ, ఐటీ విభాగం, కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ విభాగంతో పాటు పలు శాఖల్లో కీరోల్ ప్లే చేయడంతో ఈ మహిళ అవినీతి అధికారి పని సులువైంది. ఫైల్ ఫైల్ కి డబ్బులు వసూలు చేయడంతో కోట్లు కూడబెట్టింది.

ఇక ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై లోకాయుక్త..విచారణ చేపట్టాలంటూ ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు పలు దఫాల్లో దాడులు చేయగా 200 ప్రాపర్టీ డాక్యుమెంట్స్, 50 బ్యాంక్ అకౌంట్లు, 50 అఫీషియల్ చెక్ లు , 7 ప్రామిసరీ నోట్లు, రూ.36.89లక్షల క్యాష్, బిజినెస్ లకు సంబంధించి  రూ.3.5కోట్ల ఆస్తులు, 3.7కేజీల గుర్తింపు లేని బంగారం, 10.5కేజీల వెండిని గుర్తించారు. దీంతో సుధా మేడం సుమారు రూ. 250కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు ఆధారాలు వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. గత రెండు మూడు రోజులుగా సుధ ఆస్తుల పై ఇంకా ఏసీబీ అధికారుల కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అబ్రహాం దెబ్బతో డాక్టర్ సుధా అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.