ఇబ్రహీంపట్నం, వెలుగు: లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి, అతని అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్ సిటీ రేంజ్-2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన ప్రకారం.. ఆదిబట్ల పరిధిలో జీ ప్లస్ 4 నిర్మాణం కోసం మోత్కూరి ఆనంద్ అనే వ్యక్తి ఆదిబట్ల టౌన్ ప్లానింగ్ అధికారి బందెల వరప్రసాద్‌ను సంప్రదించాడు.
టీపీవో రూ.లక్షన్నర డిమాండ్ చేసి, రూ.80 వేలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం మునిసిపాలిటీ కార్యాలయంలో రూ.75 వేలు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్( ఔట్ సోర్సింగ్) వంశీకృష్ణకు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. టీపీవో వర ప్రసాద్, అసిస్టెంట్ వంశీకృష్ణను అదుపులోకి తీసుకొని వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
