యూపీలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి

యూపీలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజ్ బాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్లా ఖంగర్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపిన బస్సును వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప సైఫై మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. బస్సు జైపూర్ నుంచి దర్భంగా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగినట్లు స్థానికులు తెలిపారు.