
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం (అక్టోబర్ 06) మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి జీపు రక్షణ గోడను ఢీకొట్టింది. ఘాట్ రోడ్డులోని 24 వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఐదు మంది భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.