తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.
ALSO READ : ఇడ్లీ, దోశ, పూరీ, బోండా.. కాలేజీల్లో స్టూడెంట్స్కు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ !
