ఫ్లై ఓవర్ పై కార్మికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

V6 Velugu Posted on Mar 29, 2021

పెద్దపల్లి జిల్లా మంథని ఫ్లై ఓవర్ పై ప్రమాదం జరిగింది. ఒడిశా కార్మికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పరశురాం అనే కార్మికుడు స్పాట్ లోనే చనిపోయాడు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించగా....... మిగతా వారికి పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో దాదాపు 40మంది ఉన్నారు. సరుకుల కోసం పెద్దపల్లికి వచ్చి తిరిగి రాఘవపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా రాఘవపూర్ లోని BBI ఇటుక భట్టిలో పని చేస్తున్నారు.
 

Tagged road accident

Latest Videos

Subscribe Now

More News