షూటింగ్‌లో ప్రమాదం.. బిల్డింగ్‌పై నుంచి పడి నటుడు మృతి

షూటింగ్‌లో ప్రమాదం.. బిల్డింగ్‌పై నుంచి పడి నటుడు మృతి

ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా(58) తుదిశ్వాస విడిచారు. ఆ సినిమా షూటింగ్ వివ‌రాలు మాత్రం వెల్ల‌డికాలేదు. షూటింగ్ జ‌రుగుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ బిల్డింగ్‌పై నుంచి అఖిల్ మిశ్రా కింద‌ప‌డిన‌ట్లు తెలిస్తోంది. హైద‌రాబాద్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

అఖిల్ మిశ్రా అమీర్‌ఖాన్ త్రీ ఇండియ‌ట్స్ తో పాటు ప‌లు బాలీవుడ్‌ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఆయన  లైబ్రేరియ‌న్ పాత్ర‌లో నటించాడు. దీంతో పాటు బాలీవుడ్‌లో డాన్‌, గాంధీ మై ఫాద‌ర్‌, శిఖ‌ర్‌తో పాటు ప‌లు సినిమాల్లోనూ ఆయన డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు. సినిమాలతో పాటు సీఐడీ, ఉత్త‌ర‌న్‌, ఉడాన్‌తో స‌హా చాలా టీవీ సీరియ‌ల్స్‌లో అఖిల్ మిశ్రా కీల‌క పాత్ర‌లు పోషించాడు.

జ‌ర్మ‌న్ న‌టి సుజానే బెర్నార్ట్ ను అఖిల్ మిశ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండు సార్లు ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2009లో రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకున్న వీరిద్దరూ.. 2011లో సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో మ‌రోసారి పెళ్లి పెళ్లి చేసుకున్నారు.