తెలంగాణ భూగర్భంలో  680 టీఎంసీల నీళ్లున్నయ్‌

తెలంగాణ భూగర్భంలో  680 టీఎంసీల నీళ్లున్నయ్‌
  • గ్రౌండ్‌ వాటర్‌ అట్లాస్‌లో వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ భూగర్భంలో 680 టీఎంసీల నీళ్లున్నాయని గ్రౌండ్‌ వాటర్‌ అట్లాస్‌ వెల్లడించింది. ఇది రాష్ట్రానికి ఉన్న కృష్ణా నది నికర జలాల రెట్టింపు కంటే ఎక్కువని పేర్కొంది. 2020తో పోల్చితే 2022 లో భూగర్భ జలవినియోగం 8 శాతం తగ్గిందని తెలిపింది. శుక్రవారం హైదరాబాద్​లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరిగేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ కుమార్‌ ఈ అట్లాస్‌ విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక 26,700 చెరువులను పునరుద్ధరించామన్నారు. 1,375 చెక్‌ డ్యాంలు నిర్మించామని, ప్రాజెక్టు కాల్వలపై 3 వేల తూములు ఏర్పాటు చేసి చెరువులు నింపుతున్నామని చెప్పారు. దాంతో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. 2015తో పోల్చితే 2022లో వానాకాలం కంటే ముందే భూగర్భ జలమట్టం 4.26 మీటర్లు పెరిగిందన్నారు. భూగర్భంలో ఫ్లోరైడ్‌ తీవ్రత తగ్గిపోతోందన్నారు.