స‌ర్కార్ చెప్పినా త‌గ్గ‌ని ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దందా

స‌ర్కార్ చెప్పినా త‌గ్గ‌ని ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దందా

హైద‌రాబాద్: కరోనా పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి ప్రైవేట్ హాస్పిట‌ల్స్. ఇదే విష‌యంపై ఇప్ప‌టికే హైకోర్టు ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసినా ఫ‌లితంలేకుండాపోతుందంటున్నారు క‌రోనా పేషెంట్స్ కుటుంబ స‌భ్యులు. ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రైవేట్ హాస్పిట‌ల్స లో కరోనా దందా ఆగ‌డంలేదంటున్నారు. సికింద్ర‌బాద్ లోని శ్రీక‌ర హాస్పిట‌ల్ పీపీఈ కిట్ల కోసం నాలుగు రోజులకు రూ. లక్షా ఇరవై వేల బిల్లు వేసింద‌ని తెలిపారు. అడ్మిట్ కు ముందే రూ.3 ల‌క్ష‌లు క‌ట్టాలంటున్నార‌ని.. అలాగే రోజుకు లక్షకు పైగా బిల్లు వేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇన్సూరెన్స్ ఉన్నా.. డబ్బులు కట్టాల్సిందేన‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు చెప్పారు.

డ‌బ్బులు క‌ట్టేముందు పేషెంట్ ప‌రిస్థితి ఎలా ఉందో చెప్ప‌మంటే.. క‌నోనా పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై జ‌స్ట్ 4 సెకన్ల వీడియో పెట్టార‌ని యాజమాన్యంపై మండిప‌డ్డారు. నాలుగు సెకండ్ల వీడియోతో తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఆగ‌స్టు- 10వ తేదీన శ్రీకర (సికింద్రాబాద్)హాస్పిట‌ల్ లో అడ్మిట్ చేశామ‌ని.. క‌రోనా ట్రీట్ మెంట్ కాక‌.. పీపీఈ కిట్స్ పేరుతో మ‌రింత‌గా దోచుకుంటున్నార‌ని చెప్పారు. ఎన్ 95 మాస్కుల‌కు రూ.325 తీసుకుంటున్నార‌ని తెలిపారు. స‌ర్కార్ రూల్స్ పాటించని హాస్పిట‌ల్స్ పై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఫేయిల్ అయ్యింద‌ని మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు.