గేమింగ్ రంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్

 గేమింగ్ రంగంలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్

గేమింగ్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. 2022 గణాంకాల ప్రకారం ఆసియాలో మొదటి స్థానం, ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ఆసియాలోని టాప్ 10 దేశాల లిస్టును పరిశీలిస్తే.. అందులో 50.2 శాతం మంది గేమర్లు మన దేశంలోనే ఉన్నారు. మార్కెట్ పరిశోధన సంస్థ నికో పార్ట్‌నర్స్ ఈ డేటా అందించింది. గడిచిన 5 ఏండ్లలో గేమింగ్ రంగం ఇంత అభివృద్ధి చెందడం ఇదే తొలిసారు. 

దేశంలో ప్రస్తుతం 396.4 మిలియన్ (39.64 కోట్లు)మంది గేమర్స్ ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గేమర్ బేస్‌గా ఎదిగింది. మొబైల్, కంప్యూటర్ గేమింగ్ లో వేగంగా ఎదుగుతోంది. చాలా మంది యువత ఆన్ లైన్ గేమింగ్ పై మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల స్వయం ఉపాధి కూడా పెరుగుతోంది. భారత్ తో పాటు థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, కొరియా దేశాలు గేమింగ్ రంగంలో రాణిస్తున్నారు. 2022లో ఆసియా దేశాల గేమింగ్ మార్కెట్ 35.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2026 నాటికి 41.4 బిలియన్ డాలర్లు చేరుతుందని నికో పార్ట్‌నర్స్ అంచనా వేస్తున్నారు.