ఆధిపత్యం కోసమేనా..?
దసరా సెలవుల్లో కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో క్లాస్‌లు నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. క్లాస్‌లు నిర్వహిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయని, జరుగబోయే పరిణామాలకు యాజమాన్యాలదే బాధ్యత అని విద్యార్థి నాయకులు హెచ్చరించడంతో ట్రస్మా లీడర్ల అహం దెబ్బతిన్నదని అంటున్నారు. అంతేగాకుండా ట్రస్మాలోని ఒక వర్గం త్వరలో జరుగనున్న కమిటీ ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకే స్టూడెంట్ యూనియన్లను టార్గెట్ చేసి క్రెడిట్ కొట్టేయాలని ఆరాటపడుతోందని సమాచారం.
లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం
మంచిర్యాల : లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం జరుగుతుంది మంచిర్యాల జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్బి.సత్తయ్య తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వచ్చేనెల 12న జాతీయ లోక్అదాలత్నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్సెషన్జడ్జి మైత్రేయి తదితరులు
పాల్గొన్నారు.
మొక్కలు నాటడం అందరి బాధ్యత...
ఖానాపూర్ : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్జి నితిన్ కుమార్ చెప్పారు. శనివారం మస్కాపూర్ అర్బన్ పార్క్‌లో మొక్కలు నాటారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటుతున్న తీరును ఆయన అభినందించారు. ఎఫ్ఆర్వో వినాయక్, ఎఫ్ఎస్వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం
కాగజ్ నగర్ : కాగజ్ నగర్ మండలం అందెవెల్లి సమీపంలోని పెద్దవాగు హైలెవెల్ బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. తాత్కాలిక వంతెన నిర్మించి సమస్య పరిష్కరిస్తామని జడ్పీ వైస్చైర్మన్కోనేరు కృష్ణారావు తెలిపారు. శనివారం జంబుగా గ్రామసమీపంలోని దహెగాం, కాగజ్ నగర్, భీమిని మండలాల ప్రజలు, నాయకులు, రైతులతో కలిసి చర్చించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో త్వరలో వంతెన పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గజ్జి రామయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మణ్, దహెగాం మండల సర్పంచులు బండ కృష్ణ, వెలముల జయేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ రాజు, బొర్లకుంట సర్పంచ్ మధూకర్, ఇట్యాల ఎంపీటీసీ జయలక్మి సురేశ్, ప్రజాప్రతినిధులు మురారి, బోడేపల్లి రాజన్న, స్యాంరావు, యూత్ లీడర్పుల్ల శ్రీకాంత్ ఉన్నారు.
బీసీ గురుకులాల టీచింగ్ టైమ్ మార్చాలి
ఆసిఫాబాద్ : మహాత్మా జోతిరావు బాపూలే గురుకుల పాఠశాలల టీచింగ్టైమ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలుగా పెట్టాలని శనివారం భోజన విరామన సమయంలో బీసీ గురుకుల పాఠశాలల టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి సోయం ఇందూరావు మాట్లాడుతూ బీసీ గురుకులాల టైమ్టేబుల్మార్చుతామని శాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. అన్ని గురుకులాలకు ఒకే పనివేళలు ఉండాలన్నారు. గెస్ట్టీచర్లకు దసరా సెలవుల వేతనం కోతవిధించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఐక్య గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఎల్లయ్య, లీడర్లు రమేశ్, టీచర్లు రాధిక, చంద్రయ్య, వినోద్, శ్యాం, సంతోష్, రమేశ్, మారుతి, రవీందర్, కొండయ్య, మహేశ్, లింగయ్య, సంధ్యారాణి, లైలా కుమారి, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా దమ్మచక్ర పరివర్తన్ దివస్
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ లుంబిని దీక్ష భూమిలో శనివారం అశోక దమ్మచక్ర పరివర్తన్దివస్ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాత్రి లుంబిని దీక్ష భూమి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, రెబ్బెన, కౌటాల ఎంపీపీలు జూమ్మిడి సౌందర్య ఆనంద్, బసర్కార్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు జాడి బాపు , లుంబిని దీక్ష భూమి అధ్యక్షుడు ముంజం మనోహర్ పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
నిర్మల్ : అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐ జేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంకగారి భూమయ్య డిమాండ్‌చేశారు. శనివారం కలెక్టర్ముషారఫ్అలీ ఫారూఖీని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కైలాస్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, గుమ్ముల అశోక్, ట్రెజరర్ వకులాభరణం ప్రశాంత్, సోషల్ మీడియా ఇన్చార్జి యోగేశ్‌కుమార్, జాయింట్‌సెక్రటరీ సట్ల హనుమాండ్లు, కూనరాజు, అసోసియేట్ కార్యదర్శి రషీద్ఆలం, ప్రచార కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ ఎస్డీఎల్ మిషన్లు వద్దు
మందమర్రి : మందమర్రి ఏరియా కాసిపేట2 బొగ్గుగనిలో ఎస్డీఎల్ మిషన్లను కేటాయించడం సరికాదని, దీంతో పర్మినెంటు ఎంప్లాయిస్‌కు నష్టం కలుగుతుందని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం కేకే5 గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాసిపేట2 గనిలో సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఎస్డీఎల్మిషన్లు నడపాలని, ప్రైవేటు సంస్థ మిషన్లు అడ్డుకుంటామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, తిరుపతి, జెట్టి మల్లయ్య, టేకుమట్ల తిరుపతి, కొండయ్య, జువ్వాజి శ్రీనివాస్, శ్రీధర్, సంపత్, రామయ్య, దినేశ్తదితరులు పాల్గొన్నారు.
15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
నిర్మల్ : నిర్మల్‌జిల్లాలో 15 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ముషారఫ్అలీ ఫారూఖీ తెలిపారు. ఇప్పటివరకు 1,856 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు ఆయన చెప్పారు. శనివారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. రైతలకు ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. సమావేశంలోహార్టికల్చర్ ఆఫీసర్ రాథోడ్ శ్యామ్ రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుడి ఇంట్లో చోరీ
రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ లో దొంగతనాలు ఆగడంలేదు. తాజాగా శనివారం భగత్‌సింగ్‌నగర్‌లోని సింగరేణి కార్మికుడు ఎరవేని సతీశ్క్వార్టర్లో దొంగలుపడ్డారు. ఆరు తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ఎస్సై అశోక్ తెలిపారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కాగజ్‌నగర్ : కాగజ్ నగర్ గవర్నమెంట్డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్డి.లక్ష్మీనర్సింహం తెలిపారు. హిస్టరీ, ఇంగ్లిష్, తెలుగు, కంప్యూటర్ సైన్స్, రాజనీతి శాస్త్రం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం 7013607011 నంబర్‌కు కాల్చేయాలని సూచించారు.
హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలె
నస్పూర్ : 63వ జాతీయ రహదారి మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీఐ నాయకులు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ లీడర్లు లింగం రవి, అఫ్రోజ్ ఖాన్, కారుకూరి నగేష్, దొడ్డిపట్ల రవీందర్, మొగిలి లక్ష్మణ్, కంచ పోషం, తంగళ్ళపల్లి సురేష్ , బొడ్డు లచ్చన్న, ఇలవేన సారంగపాణి, శ్రవణ్, జడల శ్రీనివాస్, మనోహర్ పాల్గొన్నారు.
సీసీ రోడ్ల ఫండ్స్ రిలీజ్ చేయండి
భైంసా : ముథోల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సీసీ రోడ్లకు నిధులను విడుదల చేయాలని పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు ను కోరారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. సీసీ రోడ్లు వేసి చాలా రోజులైందని, సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీపీలకు సంబంధించిన నెల వారీ నిధులను కూడా విడుదల చేయాలన్నారు. ఆయన వెంట ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, శంకర్ చౌహాన్ ఉన్నారు.
లీకవుతున్న ‘భగీరథ’
కుభీర్ మండల కేంద్రంలోని రాంనగర్ గల్లీలో మిషన్‌భగీరథ పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో మంచినీరంతా రోడ్డుపై వృథాగా పోతోంది. పైపుల్లోకి చెత్తాచెదారం చేరి మురికి నీరు వస్తోందని, దోమలు, ఈగల బెడద ఎక్కువైందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. రోడ్డంతా బురదగా మారుతోందన్నారు. - కుభీర్,వెలుగు
