రాజన్నసిరిసిల్ల,వెలుగు: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మొగిలి వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద తన కారుకు సైడ్ ఇవ్వడంలేదని డ్రైవర్ పిట్ల శ్రీకాంత్ సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాల్‌రాజ్‌పై బుధవారం దాడికి దిగిన విషయం తెలిసిందే. అనంతరం శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు.
బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ అశోక్ నేతృత్వంలో శ్రీకాంత్ కోసం వెతికారు. గురువారం సాయంత్రం రహీంఖాన్ పేట శివారులో నిందితుడిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
