ఈటలపై ఫిర్యాదు చేసిన వారిపై సర్పంచ్ కీలకవ్యాఖ్యలు

ఈటలపై ఫిర్యాదు చేసిన వారిపై సర్పంచ్ కీలకవ్యాఖ్యలు

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి అసైన్డ్ భూములను కబ్జా చేశారని అచ్చంపేటకు చెందిన కొంతమంది రైతులు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై అధికారులు సర్వే చేస్తున్నారు.

కాగా.. ఈటలపై ఫిర్యాదు చేసినవారిపై గ్రామసర్పంచ్ కీలకవ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటలపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి అన్నారు. ఈ ఊరి గ్రామస్తులే గతంలో ఎకరానికి రెండు లక్షల చొప్పున ఈటల రాజేందర్‌కి అమ్ముకున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు భూమి విలువ పెరగడంతో డబ్బులకు ఆశపడి వారంతా ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అప్పుడు అమ్ముకున్న రైతులే కావాలని ఇప్పుడు తిరగబడుతున్నారని ఆమె అన్నారు. వారి వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. భూమి అమ్ముకున్న డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, అప్పులు తీర్చుకున్నారని ఆమె అన్నారు.