నార్మల్ డెలివరీ ఉత్తిదే.. అన్ని కోతలే

నార్మల్ డెలివరీ ఉత్తిదే.. అన్ని కోతలే
  • సిజేరియన్లలో మొదటి స్థానంలో రాష్ట్రం
  • ఎన్‌ ఎఫ్‌ హెచ్‌ ఎస్‌ తాజా నివేదికలో వెల్లడి
  • గత 3 నెలల్లో లక్ష కాన్పులు.. అందులో 62,591 సిజేరియన్లే
  • 4 జిల్లాల్లో 80%..10 జిల్లాల్లో 70% కోతలు

రాష్ట్రంలో కార్పొరేట్‌ , ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌‌ ఆపరేషన్ల దందా ఎప్పట్లాగే సాగుతోంది. గడచిన 3 నెలల్లో రాష్ర్ట వ్యాప్తంగా1,03,827 కాన్పు లు జరగ్గా.. అందులో ఇందులో 62,591(60%)సిజేరియన్‌‌ డెలివరీలే ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. సిజేరియన్‌‌ ఆపరేషన్లలో 54శాతం(33,801) ప్రైవేటు ఆస్పత్రుల్లో జరగ్గా.. ప్రభుత్వాస్పత్రుల్లో 28,790 జరిగాయి. తొలి కాన్పు ప్రైవేటులో సిజేరియన్‌‌ చేయించుకుని, రెండో కాన్పుకు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని, దాం తో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేయాల్సి  వస్తోందని ప్రభుత్వాస్పత్రుల గైనకాలజిస్టులు చెబుతున్నారు. గతేడాది కూడా ప్రతి వందలో 60 సిజేరియన్లే జరిగాయి. వీటిలో ప్రైవేటులో 77 శాతం, సర్కారులో 47 శాతం నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా జరిగిన సిజేరియన్‌‌ ఆపరేషన్లలో కూడా తెలంగాణ మొదటి స్థానంలోఉంది. 2015 జనవరి 2016 డిసెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రసవాలను నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌‌ సర్వే విశ్లేషించిం ది. తాజాగా విడుదల చేసినఎన్‌‌ఎఫ్‌ హెచ్‌ ఎస్‌ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 17.2 శాతం సిజేరియన్లు జరిగితే.. తెలంగాణలోఅత్యధికంగా 57.7% సిజేరియన్లు జరిగాయి. మన రాష్ట్రం తర్వాత 35.8 శాతం సిజేరియన్లతో కేరళ రెండు, 34.1 శాతం సిజేరియన్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. నాగాలాండ్‌ లో అత్యల్పం గా 5.8% సిజేరియన్లు నమోదయ్యాయి. ఈ మూడేళ్లలో సిజేరియన్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతివంద ప్రసవాల్లో, సిజేరియన్లు 15 దాటొద్దు. కానీ రాష్ట్రంలో ప్రతి వంద కాన్పుల్లో 60 సిజేరియన్లే ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు, కొంత మంది డాక్టర్ల కక్కుర్తితోపాటు గర్భిణుల్లో అపోహలు, భయాలే సిజేరియన్‌‌ కాన్పు లు పెరగడానికి కారణమని ఇంటర్నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్​ పాపులర్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌ )తెలిపింది.

4 జిల్లాల్లో 80 శాతం కోతలే

రాష్ట్రంలో ఏ జిల్లా కూడా వరల్డ్‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ నిర్ధా రించి న 15శాతం సిజేరియన్ల చేరువలో లేదు.నాలుగు జిల్లాల్లో అయితే 80 శాతానికిపైగా సిజేరి-యన్లు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇది83 శాతంగా ఉంది. 10 జిల్లాల్లో 70 శాతానికిపైగా,4 జిల్లాల్లో 60 శాతానికిపైగా, 5 జిల్లాల్లో 50 శాతా-నికిపైగా, 4 జిల్లాల్లో 40 శాతానికిపైగా, 3 జిల్లాల్లో 30శాతానికిపైగా సిజేరియన్‌‌ కాన్పు లు జరిగాయి.అత్యల్పం గా క్రుమంభీం జిల్లాలో 22శాతం ఆపరే-షన్లు జరిగాయి. ఈ మూడు నెలల కా లంలో అక్కడ1,187 ప్రసవాలు జరిగితే.. 264 మాత్రమే సిజేరియన్లు నమోదయ్యాయి.

ప్రసూతి ఆస్పత్రులపై నిఘా!

కేసీఆర్‌ కిట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిం ది. గర్భం దాల్చిన తొలి 3 నెలల్లోగా మహిళను గుర్తించి , కాన్పు జరిగే వరకూ వారిని పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు గ్రామస్థాయిలోని ఏఎన్‌‌ఎం, ఆశా వర్కర్లకు శిక్షణనిచ్చారు. హై రిస్క్‌‌  కేసులను ముందే గుర్తించి మాతా, శిశు మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. జననాల నమోదుకు ఓ ప్రత్యేక పోర్టల్‌ ను ప్రారంభించిన వైద్యారోగ్యశాఖ..ప్రతి కాన్పును అందులో నమోదు చేస్తోంది. సిజేరియన్‌‌ చేయడానికి గల కారణాన్ని ఆస్పత్రులు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుం ది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ పోర్టల్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. సిజేరియన్‌‌ డెలివరీలు చేయించుకున్న మహిళలను ర్యాండమ్‌ గా ఎంపిక చేసి ఆపరేషన్‌‌కు గల కా రణాలపై క్షేత్రస్థాయి సిబ్బం ది ద్వారా అధికారులు ఆరా తీస్తున్నారు. వారిచ్చే సమాచారంతోఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టి, ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సమాచారం.

సిజేరియన్‌ తో పని తక్కువ

చిన్నప్పట్నుం చి శారీరక శ్రమ, ఆటలకు దూరంగా ఉండడంతో చాలామందిలోనార్మల్‌‌ డెలివరీకి శరీరం సహకరించడంలేదు.  దీంతోపాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు గర్భిణుల భయాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నాయి. డాక్టర్లకు సిజేరియన్‌ చేయడం చాలా సులువు.నొప్పులు స్టార్ట్‌ అయ్యాక నార్మల్‌‌ డెలివరీకి 16-–18 గంటలు పడుతుం ది. ప్రతి నిమిషం గర్భిణిని కనిపెడుతూ ఉండాలి. అదే సిజేరియన్‌ అయితే, నిమిషాల్లో ప్రసవం ముగుస్తుంది.

– డాక్టర్‌‌‌‌ రమాదేవి,

గైనకాలజీ నిపుణులు,జన విజ్ఞా న వేదిక ఉపాధ్యక్షురాలు