ఢిల్లీలో తెలంగాణ టీచర్ల ప్రతిభ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళల ప్రదర్శన

ఢిల్లీలో తెలంగాణ టీచర్ల ప్రతిభ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళల ప్రదర్శన

నిర్మల్, వెలుగు: ఢిల్లీలో రాష్ట్రంలోని పలు జిల్లాకు చెందిన టీచర్లు మన సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన టీచర్లు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ లో ‘ రోల్ ఆఫ్ పప్పెట్రీ ఇన్ ఎడ్యుకేషన్– ఇన్ లైన్ విత్ ఎన్ఈపీ – 2020’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తమ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయ కళలను స్టేజీపై ప్రదర్శించారు. 

తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన టీచర్లు ఎల్మల ప్రవీణ్ కుమార్(నిర్మల్), ఆర్. దిలీప్ కుమార్(మంచిర్యాల), రాజేశ్​కుమార్(ములుగు), రమేశ్, విజయ్ కుమార్(జగిత్యాల), రమేశ్(యాదాద్రి భువనగిరి), ఈశ్వరరావు (వికారాబాద్), స్వప్న(ములుగు), కవిత(మెదక్), సఫియా సుల్తానా(సంగారెడ్డి),  సంస్కృతి, సంప్రదాయ కళల ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి మొదలుకొని రాష్ట్ర పండుగలు, రాష్ట్ర చిహ్నాలు, పుణ్యక్షేత్రాలు, సాహిత్యం, కవులు, ప్రసిద్ధ వ్యక్తుల గొప్పతనాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.