మా వల్లే బీసీ రిజర్వేషన్లు..నూటికి నూరు శాతం ఇది జాగృతి విజయం: ఎమ్మెల్సీ కవిత

మా వల్లే బీసీ రిజర్వేషన్లు..నూటికి నూరు శాతం ఇది జాగృతి విజయం: ఎమ్మెల్సీ కవిత
  • రైల్​ రోకోను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభు త్వానికి ఉంటే, ఈ అంశంపై కోర్టులో కేవియట్ వేసి ఎటువంటి కేసులు రాకుండా చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని యూపీఎఫ్, అన్ని కుల సంఘాలను కలుపు కొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. తమ ఉద్య మాలకు ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు.   తమ ఒత్తిడికి తలొగ్గి, రాష్ట్ర కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పిందన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు తెలంగాణ జాగృతి సాధించిన విజయమన్నారు. 

సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేసి తన మర్యాదను నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే ఆమోదం తెలిపేలా రాష్ట్ర బీజేపీ నాయకులు గవర్నర్‌‌‌‌పై ఒత్తిడి పెంచాలన్నారు. కాగా, బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తాము పిలుపునిచ్చిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు.  అనంతరం తన నివాసం నుంచి ట్యాంక్ బండ్‌‌‌‌పై  అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. మధ్యలో మింట్ కాంపౌండ్‌‌‌‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులర్పించారు.