Sydney Sweeney: హాలీవుడ్ బ్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 530 కోట్ల డీల్!

Sydney Sweeney: హాలీవుడ్ బ్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 530 కోట్ల డీల్!

ప్రపంచవ్యాప్తంగా యువత హృదయాలను కొల్లగొట్టిన హాలీవుడ్  సెన్సేషన్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney).  ఇప్పుడు ఈ అందాల హాట్ భామ బాలీవుడ్ (Bollywood) లోకి అడుగుపెట్టనుందనే వార్త సంచలనం సృష్టిస్తోంది. తన మార్క్ మసాలాతో కూడిన 'యూఫోరియా' (Euphoria), 'ఎనీవన్ బట్ యూ' (Anyone But You) వంటి రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్ తో ప్రస్తు తం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది.

తన నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆత్రుతగా, ఆశగా ఎదురు చూసేవారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ అగ్ర కథానాయిక, ఒక భారతీయ సినిమాలో నటించేందుకు రూ.530 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భారీ డీల్ కు సంబంధించిన వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో  ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. 

 ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ సిడ్నీని తమ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి ఈ అసాధారణమైన మొత్తాన్ని ఆఫర్ చేసిందని ముంబై సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ డీల్ గనక నిజమైతే, ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక నటి అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డును సిడ్నీ స్వీనీ సృష్టించనుంది. గతంలో ఏ హాలీవుడ్ నటి కూడా ఇండియన్ సినిమాలో ఇంత భారీ మొత్తాన్ని తీసుకున్న దాఖలాలు లేవు.

సిడ్నీ స్వీనీ ఈ కొత్త సినిమా విషయంలో ఒక కీలక పాత్రలో నటించనుందని, ఇది హాలీవుడ్, బాలీవుడ్ కలయికలో రూపొందుతున్న ఒక భారీ ప్రాజెక్టు అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ డీల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, అభిమానులు ఈ వార్తపై ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా ఇప్పటి వరకు  రూ. 100 నుంచి 700 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఇండియన్ సినిమాలు వచ్చాయి.  అలాంటిది, ఒక నటికి రూ.530 కోట్లు ఇవ్వడం అనేది భారతీయ సినిమాకు హాలీవుడ్ ( Hollywood ) మార్కెట్‌ను పెంచే ఒక వ్యూహాత్మక అడుగుగా భావించవచ్చు.  ఈ డీల్ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని సినీ వర్గాల సమాచారం. సిడ్నీ స్వీనీ అభిమానులంతా ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు.  ప్రస్తుతం ది హౌస్ మెయిడ్ మూవీలో నటిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.