డేటింగ్ యాప్: అమ్మాయిగా ఛాట్ చేసి రూ.లక్షా 90 వేలు కొట్టేశారు!

డేటింగ్ యాప్:  అమ్మాయిగా ఛాట్ చేసి రూ.లక్షా 90 వేలు కొట్టేశారు!

మోసపోయిన యువకుడు

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ డేటింగ్ యాప్ లో అమ్మాయిగా చాటింగ్ చేసి ఓ యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 28 ఏండ్ల యువకుడుకి గత జూన్ 3న చాట్ జోజో అనే డేటింగ్ యాప్ లో మడుగుల శరణ్య(స్కామర్స్ క్రియేట్ చేసిన ఫేక్ ప్రొఫైల్) పరిచయమైంది.  తాను అనాథనని చెప్పుకుని  కొన్ని రోజులు యువకుడితో సన్నిహితంగా చాట్ చేసింది. జాబ్​ కోసం ప్రయత్నిస్తున్నానని, అందుకోసం డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి.. పలు దఫాలుగా రూ.95 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.

  అదే నెల 18న శరణ్య సూసైడ్​ అటెంప్ట్​ చేసిందని, ఆమె ఇంటి ఓనర్ గా  నటిస్తూ సుభాశ్​ పేరుతో బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రి ఖర్చుల పేరుతో మరో రూ.95 వేలు వసూలు చేశారు. ఆ డబ్బులను తిరిగి పంపించినట్లు స్కామర్స్ తెలిపారు. అయితే బాధితుడి అకౌంట్ కు ఎలాంటి డబ్బులు అందకపోవడంతో  తను మోసపోయానని గుర్తించాడు.  మొత్తం రూ.లక్షా 90 వేలు పోగొట్టుకున్నాక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.