వాషింగ్టన్: కరోనా మరింత విస్తరించకుండా ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇండియా ప్రజలంతా కలసి కట్టుగా జనతా కర్ఫ్యూను సక్సెస్ చేయడం స్ఫూర్తిదాయకమని, ఈ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు అందించిన వారి సేవలు గొప్పవని కొనియాడింది. ‘‘కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ, మెడికల్ సర్వీసులు అందిస్తున్న వారికి సంఘీభావంగా ఇండియా జనమంతా కలసికట్టుగా ముందుకురావడం స్ఫూర్తిదాయకం”అంటూ సౌత్, సెంట్రల్ ఆసియా తాత్కాలిక అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్అలీస్ జి వెల్స్ ఓ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తున్న వారికి మద్దతుగా జనమంతా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ, డ్రమ్స్ వాయిస్తున్న ఓ వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేయగా.. ఆమె దానిని రీ ట్విట్చేశారు. మరోవైపు అమెరికాలో ఇండియా అంబాసిడర్ తరన్‌జిత్ సింగ్సంధూ సోమవారం అమెరికాలోని ఇండియా కంపెనీల ప్రతినిధులతో కరోనా ఔట్బ్రేక్పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఇండియా కంపెనీలు స్థానికులకు సహాయం అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించి కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్టు సంధూ చెప్పారు.
