యాక్షన్ క్రైమ్ డ్రామా వన్‌‌‌‌ బై ఫోర్ బోర్ కొట్టదు: పళని కె

యాక్షన్ క్రైమ్ డ్రామా వన్‌‌‌‌ బై ఫోర్ బోర్ కొట్టదు: పళని కె

వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌‌‌‌గా పళని కె తెరకెక్కిస్తున్న  యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’.  రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్  నిర్మించారు. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. 

హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ ‘బాహుబలికి పని చేసిన మా దర్శకుడు పళని గారి  టేకింగ్‌‌‌‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు. వంద శాతం హిట్ కొడతామనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో తమ పాత్రలు అందర్నీ అలరిస్తాయని హీరోయిన్స్ అన్నారు.  అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చిందని ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెప్పారు.