టైగర్ నాగేశ్వరరావులో రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యాక్షన్ సీన్స్ తీశాం

టైగర్ నాగేశ్వరరావులో  రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యాక్షన్ సీన్స్ తీశాం

యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమకంటూ స్పెషల్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. రవితేజ కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’కి వీళ్లు ఫైట్స్ కంపోజ్ చేశారు. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదలవుతున్న సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘స్టూవర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురం గజదొంగ నాగేశ్వరరావుగా రవితేజ ఇందులో నటించారు. మేము కూడా ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. 

నాగేశ్వరరావు గురించి ఊర్లో కథలు కథలుగా విన్నాం కనుక ఈ కథ మాకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ కూడా ఈ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాగా యాప్ట్ అయ్యారు. నాగేశ్వరరావు అప్పట్లో రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, ముందే సవాల్ చేసి మరీ దొంగతనం చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తేవారని..  ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఆయన గురించి విన్నాం. అలాంటి పాత్రను తెరపై  చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. మేం కూడా యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంపోజ్ చేశాం. 

ఆయన నివసించిన చీరాల ప్రాంతంలోని  జీడి తోటల్లో కొన్ని యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశాం. రవితేజతో  ఎన్నో చిత్రాలు చేశాం. ఇది మాత్రం మాకు కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. రన్నింగ్ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కడం లాంటి సీన్స్ కోసం ఆయన కూడా బాగా కష్టపడ్డారు. రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుంది.  ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రేక్షకులు రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతారు’ అని చెప్పారు.