ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి : హైకోర్టులో షేజల్ పిటిషన్

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి : హైకోర్టులో షేజల్ పిటిషన్

బెల్లంపల్లి, వెలుగు :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై అక్రమ కేసులు పెట్టించి, లైంగిక వేధింపులకు గురిచేశారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆరిజన్ డెయిరీ సీఏవో షేజల్ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉల్లంఘించి 8 ఏండ్లుగా ఒకే జిల్లాలో ఉంటూ ఎమ్మెల్యేకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేసినట్లు వివరించారు.

ఈ మేరకు షేజల్ సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఏడు నెలలుగా న్యాయం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసన తెలియజేశాను. అయినా.. నాకు న్యాయం జరగలేదు. మంత్రులు, ఎంపీలకు విన్నవించినా దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోలేదు.”అని వీడియోలో షేజల్ చెప్పారు.